News September 1, 2024

శ్రీకాకుళం: అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

image

నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి గార మండలంలోని కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బలమైన గాలులు, తీరం దాటిన అనంతరం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టింది.

Similar News

News September 13, 2024

ఇచ్చాపురం: కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి

image

సిక్కోలు జిల్లాలో కిడ్నీ రోగానికి మరొకరు బలయ్యారు. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం ఆశి వీధికి చెందిన దల్లి గురుమూర్తి(39) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం చనిపోయారు. ఆయనకు భార్య మాణిక్యం, ఇద్దరు కుమార్తెలు గీతా, శ్రావణి, కుమారుడు తేజ ఉన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

News September 13, 2024

శ్రీకాకుళం మెప్మా పీడీగా ఎస్వీ రమణ

image

శ్రీకాకుళం మెప్మా పీడీగా విధులు నిర్వహిస్తున్న ఎం.కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెప్మా కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న ఎస్వీ రమణ పీడీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కిరణ్ కుమార్‌కు స్థానిక కార్యాలయ సిబ్బంది వీడ్కోలు పలికారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రమణకు అభినందనలు తెలిపారు.

News September 13, 2024

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలం: ధర్మాన

image

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఇచ్చాపురంలో స్థానిక నాయకులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.