News July 29, 2024

శ్రీకాకుళం: అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

APSRTCలో అప్రెంటిషిప్ కోసం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రజా రవాణా అధికారి సోమవారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రికల్, డ్రాఫ్ట్ మెన్ , సివిల్ ట్రేడుల్లో దరఖాస్తుకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. వివరాలకు www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. దరఖాస్తుకు  చివరి తేదీ ఆగస్టు 16. 

Similar News

News October 8, 2024

కంచిలి: భవానీ సన్నిధానంలో విషాదం

image

కంచిలి మండలం నారాయణ బట్టి గ్రామంలో భవానీ సన్నిధానంలో జరిగిన దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన భవానీ సన్నిధానంలో గ్రామానికి చెందిన కోన మణి (21) అనే భవానీ మాలధారణ చేసిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు గురు స్వామి సూచనలతో భవానీ మాలధారణ చేసిన భక్తులందరూ దీక్ష విరమించుకున్నట్లు వారు పేర్కొన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: ఈ నెల 14వ తేదీన పల్లె పండుగ

image

ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ‘పల్లె పండుగ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లుచేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పల్లె పండుగ కార్యక్రమాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

News October 8, 2024

10న YCP శ్రీకాకుళం జిల్లాధ్యక్షుడిగా ధర్మాన ప్రమాణస్వీకారం

image

నరసన్నపేట YCP కార్యాలయంలో ఈ నెల 10న పార్టీ జిల్లాధ్యక్షుడిగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డాక్టర్స్ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎంపీపీ మురళి తెలిపారు. నరసన్నపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.