News May 24, 2024

శ్రీకాకుళం: ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆముదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

Similar News

News February 16, 2025

జలుమూరు: మూడు రోజులపాటు రైల్వే గేటు మూసివేత

image

జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు ఈ నెల 17, 18, 20 తేదీల్లో మూసి వేస్తున్నట్లు రైల్వే సెక్షన్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలాస నుంచి శ్రీకాకుళం వరకు రైలు మార్గంలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ దారిలో ప్రయాణించే వాహనాలు మళ్లింపు చేస్తున్నామని ప్రయాణికులు సహకరించాలని కోరారు.

News February 16, 2025

టెక్కలి: యువకుడి బ్రెయిన్‌డెడ్.. అవయవదానం

image

టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం నల్లబొంతు గ్రామానికి చెందిన మామిడిపల్లి సతీష్ (24) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు.. శనివారం యువకుడి నేత్రాలు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి వివిధ ఆసుపత్రులకు తరలించారు.

News February 16, 2025

శ్రీకాకుళంలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..!

image

శ్రీకాకుళం జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఇది వరకూ ఈ కార్యాలయం బొబ్బిలిలో ఉండేదని చెప్పారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఎంతో ఉందని అన్నారు. రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. 

error: Content is protected !!