News June 5, 2024
శ్రీకాకుళం: ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక

విద్యార్థులకు అందించే బస్సు పాసులు నూతన విద్యా సంవత్సరంలో ఆర్టీసీ ఇచ్చే రాయితీలకు సంబంధించి పాత వెబ్సైట్ పనిచేయదని.. దాని స్థానంలో కొత్త వెబ్సైట్ తీసుకువస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.విజయ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈనెల 6,7 తేదీల్లో పనిచేయదని 8 వ తేదీ నుంచి యథావిధిగా పనిచేస్తుందన్నారు. ఎంఎస్ టీ పాసులు మంజూరు మరింత సులభతరం అవుతుందన్నారు.
Similar News
News December 5, 2025
అర్హులందరికీ జీవన భృతి: మంత్రి అచ్చెన్న

మొంథా తుఫాన్ కారణంగా ప్రభుత్వం వేటకు వెళ్లరాదని ప్రకటించడంతో మత్స్యకారులు 5 రోజులు పాటు వేటకు
వేళ్లలేదు. జీవన భృతిని ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించింది. దీంతో వారందరికీ 50 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులందరికీ భృతి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు.
News December 5, 2025
అరసవల్లి రథసప్తమికి పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి మహోత్సవ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం పటిష్ఠమైన క్యూలైన్ల ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రత దృష్ట్యా క్యూలైన్లలో సీసీ కెమెరాలు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
News December 5, 2025
రణస్థలం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జేసీ

రణస్థలం మండలం పైడిభీమవరం మెగా పీటీఎం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అన్నారు. అనంతరం వల్లభరావుపేట, సంచాం, కొండములగాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే మిల్లర్లకు ధాన్యం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఓ పాల్గొన్నారు.


