News August 20, 2024

శ్రీకాకుళం: ఇంటర్‌తో ఐటీ రంగంలో ఉద్యోగాలు

image

ఇంటర్ అర్హతతో ఐటీ రంగంలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు డీవీఈవో ఎస్.తవిటినాయుడు పేర్కొన్నారు. 2023- 2024లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 24న నరసన్నపేట జ్ఞాన జ్యోతి కళాశాలలో ఓ కంపెనీ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 75 శాతం అంత కంటే మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. కంపెనీ నిర్వహించే కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూలో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు.

Similar News

News December 7, 2025

ఎచ్చెర్ల : జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా భాస్కరరావు

image

ముద్దాడ రేషన్ డిపో డీలర్ పగడ భాస్కరరావును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమిస్తూ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. పౌరసరఫరాల శాఖ రేషన్ డిపోలో పారదర్శకతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించారు. తనకు అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా చేస్తానని భాస్కర్ రావు తెలిపారు.

News December 7, 2025

SKLM: నేడు ఎన్ఎంఎంఎన్ ఎగ్జామ్..పరీక్షా కేంద్రాలివే

image

విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ ప్రతిభా ఉపకార వేతనం(ఎన్ఎంఎంఎన్) ద్వారా స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. దీని కోసం NMMN ఎగ్జామ్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 8వతరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కాగా..ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి నెల రూ.1000లను ఇస్తూ ఏడాదికి రూ.12వేలను అందిస్తుంది. నేడు పలాస, టెక్కలి, శ్రీకాకుళంలో ఉదయం 10-1 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.

News December 6, 2025

విమాన టికెట్ ధరలు పెంచకూడదు: కేంద్ర మంత్రి

image

విమానయాన రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఇండిగో సంస్థ కార్యకలాపాలను సమీక్షించారు. ఇండిగో సంస్థ తమ సేవలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెచ్చుకోవాలని, టికెట్ ఛార్జీలను పెంచరాదని మంత్రి ఆదేశించారు.