News March 10, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 17,523 మందికి గాను 17,171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని తెలిపారు. కాగా సోమవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు.

Similar News

News March 11, 2025

శ్రీకాకుళం: జీరో పావ‌ర్టీ పీ-4 విధానం ప్రారంభం- కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @ 2047 కార్యాచరణలో భాగంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన జీరో పావర్టీ-పీ4 విధానం ప్రక్రియ జిల్లాలో మొదలైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) విధానానికి ఉగాది నుంచి ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు.

News March 10, 2025

శ్రీకాకుళం: ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి: రామ్మోహన్

image

శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం లేఖ రాశారు. శ్రీకాకుళంలో 197 కి.మీ సముద్ర తీరం ఉండి, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్య్స సంపదపై ఆధార పడి జీవిస్తున్నారన్నారు. సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామంలో మత్య్స నౌకాశ్రమం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.

News March 10, 2025

శ్రీకాకుళం: జీరో పావ‌ర్టీ పీ-4 విధానం ప్రారంభం- కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @ 2047 కార్యాచరణలో భాగంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన జీరో పావర్టీ-పీ4 విధానం ప్రక్రియ జిల్లాలో మొదలైందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) విధానానికి ఉగాది నుంచి ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!