News March 15, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 365 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శనివారం 365 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ పి దుర్గారావు శనివారం తెలిపారు. 17,452 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 17,087 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన వివరించారు.
Similar News
News March 16, 2025
ఇచ్ఛాపురం: కరెంటు స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం మండలం కొలిగాం గ్రామ సమీప మలుపు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్‌కు చెందిన రాజేశ్ ఓ ఇటుకుల కంపెనీలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని మరో వ్యక్తితో బైక్‌పై అతివేగంగా వస్తూ.. కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.
News March 16, 2025
కలకత్తా నుంచి కన్యాకుమారికి సైకిల్ ర్యాలీ

సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు 6,500 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం గుండా సైకిల్ ర్యాలీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ర్యాలీ శనివారం రాత్రి ఆంధ్ర రాష్ట్రంలోకి విచ్చేసిన సందర్భంగా కంచిలిలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. భారతమాతాకి జై అంటూ వారు నినాదాలు చేశారు. ఈ ర్యాలీ పాల్గొన్న 60 మందిని సత్కరించారు.
News March 16, 2025
శ్రీకాకుళం: నేడు 11 మండలాలకు రెడ్ అలర్ట్: APSDMA

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 11 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాడ్పులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా రెడ్ అలర్ట్ జారీ చేసింది. జి.సిగడం 41.3, ఆమదాలవలస 40.6, బూర్జ 41.6, హిరమండలం 41.6, జలుమూరు 40.6, కొత్తూరు 41.6, ఎల్.ఎన్.పేట 41.5, పాతపట్నం 41.3, సారవకోట 40.8, సరుబుజ్జిలి 41.2, పొందూరు 40.3