News July 22, 2024

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

కళాశాలకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన గరుగు పవన్ కుమార్(17) కళాశాలకు వెళ్లకుండా ఇంట్లో ఫోన్లో ఆటలు ఆడుకుంటున్నారని మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మరణించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు.

Similar News

News March 1, 2026

రణస్థలం: మామకు తలకొరివి పెట్టిన కోడలు

image

రణస్థలం కాపువీధికి చెందిన కె.రామప్పడు అనే విశ్రాంత ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన కోడలు ఉమా మామ మృతదేహానికి తలకొరివి పెట్టింది. రామప్పడు భార్య చిన్నమ్మడు, కుమారులు అప్పన్న, రాంబాబు కొన్నాళ్ల క్రితం మృతిచెందగా అనారోగ్యానికి గురైన మామకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

News March 1, 2026

శ్రీకాకుళం డయేరియా.. మరో ఇద్దరు అధికారుల సస్పెండ్

image

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన ఘటనలో మున్సిపల్ కమీషనర్‌ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి సరఫరా విభాగం డీఈఈ జగన్మోహన్, దమ్మలవీధిలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శరత్‌ను విధులు నుంచి తొలగిస్తూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ శనివారం ఉత్తర్వులు జరిచేశారు. ఎమ్‌హెచ్ఓ సుధీర్, ఇంచార్జ్ ఈఈ కమలాకర్‌తో పాటు మరికొందరకి షోకాజ్ నోటీలుసు జారీ చేశారు. మరికొంతమంది అధికారులకు వేటుపడే అవకాశముంది.

News March 1, 2026

SKLM: ‘పటిష్ఠమైన భద్రత ఉన్న భవనంలో మాదకద్రవ్యాల నిల్వ ఉంచాలి’

image

పటిష్ఠమైన భద్రత ఉన్న భవనంలో పట్టుబడిన మాదకద్రవ్యాలు నిల్వ ఉంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం పాత వంశధార క్వార్టర్స్‌లోని భవనాలను కలెక్టర్‌తో పాటు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏ‌ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. భవనం చుట్టూ ఫ్లడ్ లైట్లు, నిరంతర నిఘా కోసం అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.