News April 12, 2025
శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులారా.. GET READY

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 15, 2025
శ్రీకాకుళం : ఘోర ప్రమాదం.. అమ్మ కోసం పాప వెతుకులాట

తల్లి మృతిని గ్రహించలేక బిడ్డ అమ్మ కోసం వెతుకులాట చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఇటీవల అనకాపల్లి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా బారువకు చెందిన సత్యనారాయణ భార్య నిర్మల మృతి చెందింది. అదే ఘటనలో ఆమె కుమార్తె ప్రవల్లికను ఒక యువతి కాపాడింది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి తల్లిని కోల్పోయింది. తల్లి మృతి చెందిన విషయం తెలియక ఆ చిన్నారి అయోమయపు చూపులు స్థానికులను కలచివేసింది.
News April 15, 2025
గార : పోరుబందరు పోర్ట్‌లో మత్యకారుడు అదృశ్యం

గార మండలం మోగదాలపాడుకు చెందిన మత్స్యకారుడు పుక్కళ్ల సిద్ధార్థ (సర్దార్) (44) చేపలు వేట కోసం గుజరాత్‌లోని పోరుబందరు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 8వ తేదీన వేట పూర్తైన తరువాత రూమ్‌కి రాలేదని బోట్ డ్రైవర్ గురుమూర్తి మంగళవారం తెలిపారు. అప్పటి నుంచి వెతికామని ఆయన కానరాలేదన్నారు. సిద్ధార్థకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News April 15, 2025
కోటబొమ్మాళిలో వ్యక్తి ఆత్మహత్య

కోటబొమ్మాళి గ్రామంలోని విద్యుత్ నగర్లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. మృతుడు బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన కోరాడ వాసుగా గుర్తించామన్నారు. SBI వెనుక ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఉరివేసుకున్నాడని అందిన సమాచారంతో పరిశీలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతికి కారణాలు తెలయాల్సి ఉందని తెలిపారు.