News June 27, 2024
శ్రీకాకుళం: ఇంటర్ సప్లమెంటరీలో 42.84 శాతం ఉత్తీర్ణత

ఇంటర్మీడియట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ జనరల్ కోర్సుల విభాగం నుంచి 7,113 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 3,047 మంది ఉత్తీర్ణులై 42.84 శాతం ఫలితాలు సాధించారు. ఒకేషనల్ విభాగంలో 341 మంది పరీక్షలు హాజరై 174 మంది ఉత్తీర్ణులై 51.03 శాతం ఫలితాలు సాధించారని అధికారలు తెలిపారు.
Similar News
News October 28, 2025
శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లు రద్దు

తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్టు రైల్వే జీఎం పరమేశ్వర ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మేరకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులను సూచించారు.
News October 28, 2025
SKLM: మైనారిటీ యువతకు జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు

నిరుద్యోగ మైనారిటీ యువతకు జర్మనీలో ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి ఉరిటి సాయికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐలో 2 సంవత్సరాలు, డిప్లోమాలో 3 సంవత్సరాలు అనుభవం ఉన్న యువకులు అర్హులన్నారు. నవంబర్ 2వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99888 53335 నంబర్కు సంప్రదించాలని తెలియజేశారు.
News October 28, 2025
SKLM: ‘ఆపత్కాలంలో అధికారుల సమన్వయం కీలకం’

మొంథా తుఫాను ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా, జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధర బాబుతో కలిసి సోమవారం క్షేత్ర పర్యటన ముగించుకున్న అనంతరం, కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా డెలివరీ తేదీలు దగ్గర పడిన గర్భిణీలకు వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు.


