News July 16, 2024

శ్రీకాకుళం: ఇగ్నోలో అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. సోమవారంతో గడువు ముగియగా, జులై 31 వరకు గడువు పొడిగించినట్లు వర్శిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు శ్రీకాకుళంలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

Similar News

News November 1, 2025

కాశీబుగ్గ ప్రమాదంపై శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం

image

కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది వరకు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. ప్రమాదంపై సమాచారం కొరకు 08942 240557 కంట్రోల్ రూం నంబర్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.

News November 1, 2025

కాశీబుగ్గ ఘటనలో ఇద్దరు టెక్కలి వాసులు మృతి

image

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 10కి చేరింది. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో టెక్కలి మండలానికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. టెక్కలి(M) రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరి చిన్నమ్మి, పిట్టలసరియాకి చెందిన రాపాక విజయ అనే ఇద్దరు మహిళలు మరణించినట్లు గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల్లో, కుటుంబాల్లో విషాదం నెలకొంది.

News November 1, 2025

కాశీబుగ్గ ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

image

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి <<18167876>>ఆలయ తొక్కిలాట దుర్ఘటన<<>>పై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దేవాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి.. సంఘటన స్థలానికి బయల్దేరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది.