News June 30, 2024
శ్రీకాకుళం: ఇన్స్టంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇన్స్టంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ చివరి ఏడాది 5 సెమిస్టర్ థియరీ సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన రెగ్యులర్ అభ్యర్థులకు ఇన్స్టంట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారని డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 4, 6వ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ వరకు ఉత్తీర్ణులై ఉండాలి. జులై 5వ తేదీలోగా పరీక్ష ఫీజు రూ.1000 చెల్లించాలి. పరీక్ష జులై 9న ఉంటుంది.
Similar News
News October 23, 2025
నరసన్నపేట: నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన నరసన్నపేటలోని దేశవానిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన జనార్ధన్ (45) గత కొన్నేళ్లుగా మానసిక పరిస్థితి బాగులేదు. బుధవారం ఉదయం కనిపించకపోగా కుటుంబీకులు వెతికారు. సాయంత్రం నెలబావిలో శవమై తేలడంతో స్థానికులు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. బంధువుల ఫిర్యాదుతో ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.
News October 23, 2025
టెక్కలి: రూ. 5 కోట్లతో ఎండల మల్లన్న ఆలయాభివృద్ధి

ఎండల మల్లికార్జున స్వామి సమగ్ర ఆలయాభివృద్ధికి రూ. ఐదు కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.