News July 27, 2024

శ్రీకాకుళం: ఇసుక అక్రమంగా తరలిపోకుండా కమిటీలు

image

అక్రమ ఇసుక తరలిపోకుండా జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీతో ఇసుక రవాణాకు సంబంధించి ధర నిర్ణయంపై కలెక్టర్ జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో శనివారం సమీక్షించారు. ఇసుక అక్రమంగా తరలిపోకుండా మండలాల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News February 24, 2026

అదుపులో డయేరియా: శ్రీకాకుళం కలెక్టర్

image

శ్రీకాకుళం పట్టణ కేంద్రంలోని దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట, కాకివీధి ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిబ్రవరి 23న కేసులు వెలుగుచూసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News February 24, 2026

శ్రీ‌కాకుళం: డయేరియా మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు

image

శ్రీ‌కాకుళం న‌గ‌ర కార్పొరేష‌న్ ప‌రిధిలో డ‌యేరియాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్ర‌భుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాల‌కు మెరుగైన వైద్యం, వైద్యుల నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండేవిధంగా ఆదేశాలిచ్చామన్నారు.

News February 24, 2026

సారవకోట: జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా 70 ఉద్యోగాలు

image

జిల్లా గ్రంథాలయ సంస్థలో 70 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు తెలిపారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లా పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన 8% గ్రంథాలయ సెస్సు‌లను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.