News December 6, 2024

శ్రీకాకుళం: ఈనెల 12 నుంచి డిగ్రీ పరీక్షలు

image

శ్రీకాకుళంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రధమ సంవత్సర విద్యార్థులకు ఈనెల 12వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ.. 12 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

Similar News

News January 14, 2025

తెలుగు పండుగ సంక్రాంతి విశిష్టత

image

తెలుగు పండుగల్లో మొదటిదైనా భోగి తర్వాత మకర సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. దీనికి ఆ పేరు రావడానికి కారణం చూస్తే సూర్యుడు ఏడాదిలో నెలకు ఒక్కొక్కటి చొప్పున 12 రాశుల్లో మారుతాడు. ఇలా మారడాన్ని సంక్రమణం అంటారు. ఈ క్రమంలో ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. భోగితో ధనుర్మాసం ముగుస్తుంది. అనంతరం వచ్చే మకరసంక్రాంతికి ఇంటిల్లపాది ఒక దగ్గరకు చేరి పిత‌ృదేవతలకు కొత్త దుస్తులు సమర్పిస్తారు.

News January 13, 2025

పాలకొండ: మాజీ రాజ్యసభ సభ్యుడు రాజశేఖరం మృతి

image

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం ఇటీవల అనారోగ్యంతో శ్రీకాకుళంలోని జేమ్స్ హాస్పిటల్ చేరారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలు తర్వాత తుదిశ్వాస విడిచారు. గతంలో రాజశేఖరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, MLA, రాజ్యసభలో ఎంపీగా సేవలు అందించారు. 1970లో వీరఘట్టంలోని నీలానగరం సర్పంచ్‌గా గెలవడంతో రాజకీయం ప్రస్థానం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె.

News January 13, 2025

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

టెక్కలి మండలం కె కొత్తూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొని  ఓ వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి మండలం పెద్దసాన గ్రామానికి చెందిన బందాపు అప్పారావు గ్రామానికి వెళ్తున్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న ఆయనను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.