News September 13, 2024

శ్రీకాకుళం: ఈనెల 19 నుంచి RBI క్విజ్ పోటీలు

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్థాపించి 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆన్‌లైన్‌లో జాతీయస్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు క్విజ్ పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్రస్థాయి, సౌత్ ఇండియా, జాతీయ స్థాయి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. దీని కోసం https://www.rbi90.quiz.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

Similar News

News October 12, 2024

శ్రీకాకుళం: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?

image

దసరా పండుగ అనగానే పల్లె గుర్తుకొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. పల్లెల్లో తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

image

జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.

News October 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో వీళ్ల టార్గెట్ ఒంటరి మహిళలే

image

ఖాళీగా ఉన్న ఇళ్లు, ఒంటరి వృద్ధులు, మహిళలే లక్ష్యంగా చేసుకుని <<14332419>>చోరీలకు<<>> పాల్పడుతున్న రాజగోపాల్, కిరణ్ తండ్రికొడుకులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ ముందుగా రెక్కీ నిర్వహించి వృద్ధులు, మహిళలు ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడతారన ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద రూ.7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కాగా వారికి ఓ మహిళ కూడా సాయపడినట్లు తెలిపారు.