News April 19, 2024
శ్రీకాకుళం: ఈనెల 24 చివరి గడువు

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 24తో గడువు ముగిస్తుందని శ్రీకాకుళం ఆర్ఐఓ పి. దుర్గారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఆన్లైన్ ద్వారా ఈనెల 24లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయిన వారికి మే 1 నుంచి 4 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Similar News
News July 10, 2025
మెళియాపుట్టి: విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి

మెళియాపుట్టి మండలం గొప్పిలిలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి మహేష్ (9) తన ఇంటి మేడపై మొక్కను నాటేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. విగతజీవిగా పడిన ఉన్న బాలుడుని కుటుంబీకులు ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు.
News July 10, 2025
కళింగపట్నంలో నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మెాహన్

ఎత్తిపోతల పథకం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానాయన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో నిర్మాణం జరుగుతున్న కళింగపట్నం వమరవెల్లి ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు స్థితిగతులను ఎమ్మెల్యే గొండు శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు.
News July 10, 2025
శ్రీకాకుళంలో నేడు ఉద్యోగ మేళా..!

శ్రీకాకుళంలోని బలగ గవర్నమెంట్ ఐటిఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. మేళాలో హైదరాబాద్ హెటిరో డ్రగ్స్ ఫార్మాసిటికల్ కంపెనీలో వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇంటర్, డిప్లొమా మెకానికల్, ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు కళాశాలలో హాజరవ్వాలన్నారు.