News August 27, 2024
శ్రీకాకుళం: ఈనెల 30లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి
ఇంజినీరింగ్ ప్రవేశాల మూడో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల అలాట్మెంట్‌లను అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా సీటు వచ్చిన అభ్యర్థులు కళాశాలల్లో ఈనెల 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. జిల్లాలో మొత్తం నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తం సీట్లు 2154 కాగా 1903 ప్రవేశాలు జరిగాయి. 252 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వివరాలకు SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి.
Similar News
News September 8, 2024
శ్రీకాకుళం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రానున్న 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మత్స్యకారులు 3 రోజులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08942-240557కు ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ cosklmsupdtd@gmail.com ద్వారా ఫొటోలను పంపించాలని తెలిపారు.
News September 7, 2024

శ్రీకాకుళం: మరో మూడు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.