News May 4, 2024
శ్రీకాకుళం: ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభం

ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News October 17, 2025
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు: శ్రీకాకుళం కలెక్టర్

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్సేల్ షాపులను పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలన్నారు.
News October 17, 2025
పలాస: అర్జీదారులు సమస్యలు చట్టపరిధిలో పరిశీలించి పరిష్కరించాలి

అర్జీదారులు సమస్యలు చట్టపరిధిలో పరిశీలించి వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని జిల్లా SP కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.టెక్కలి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకోసం ఈప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ, ఆస్తి గొడవలు వంటివాటిపై దరఖాస్తులు అందాయన్నారు.
News October 17, 2025
విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.