News June 30, 2024

శ్రీకాకుళం: ఈవీఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈవీఎం యూనిట్స్‌ను స్ట్రాంగ్ రూమ్‌లలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎంల గోడౌన్ సందర్శించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవిఎమ్ గోడౌన్ పరిశీలించినట్లు తెలిపారు.

Similar News

News October 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

image

జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.

News October 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో వీళ్ల టార్గెట్ ఒంటరి మహిళలే

image

ఖాళీగా ఉన్న ఇళ్లు, ఒంటరి వృద్ధులు, మహిళలే లక్ష్యంగా చేసుకుని <<14332419>>చోరీలకు<<>> పాల్పడుతున్న రాజగోపాల్, కిరణ్ తండ్రికొడుకులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ ముందుగా రెక్కీ నిర్వహించి వృద్ధులు, మహిళలు ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడతారన ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద రూ.7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కాగా వారికి ఓ మహిళ కూడా సాయపడినట్లు తెలిపారు.

News October 12, 2024

అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు: శ్రీకాకుళం ఎస్పీ

image

విజయదశమి సందర్భంగా గ్రామాల్లో అమ్మవారికి కొమ్మలు వేసే సమయంలో వర్గాలుగా వీడి కొట్లాటకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల వారీగా రౌడీ షీట్ నమోదైన వారు, ఆకతాయిల వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయన్నారు. అలాంటివారిపై పూర్తి నిఘా పెట్టామని ఆయన వెల్లడించారు.