News August 29, 2024

శ్రీకాకుళం: ఈ నెల 30న వన మహోత్సవం

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళ నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సభాధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరవుతారని తెలిపారు.

Similar News

News October 25, 2025

SKLM: ‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి

image

మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ తుపాను జిల్లాపై అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించిందని, జిల్లాలోని ఆయా శాఖల ఉన్నతాధికారులతో నేడు టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అత్యవసర సమయాల్లో 08942-240557 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.

News October 25, 2025

గార: నాగుల చవితి జరుపుకోని గ్రామం ఇది!

image

దీపావళి అమావాస్య తర్వాత వచ్చే నాగుల చవితిని ప్రతి గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం కొనసాగుతోంది. అయితే జిల్లాలోని గార మండలం బూరవెల్లిలో నాగులచవితిని మాత్రం ఇవాళ జరుపుకోరు. ఏటా కార్తీక శుద్ధ షష్టి తిథి నాడే ఇక్కడ చవితిని జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని గ్రామానికి చెందిన వేద పండితులు ఆరవెల్లి సీతారామాచార్యులు తెలిపారు. ఇందుకు నిర్ధిష్ట కారణం ఏదీ లేదని.. షష్టి నాడు జరుపుకుంటామన్నారు.

News October 25, 2025

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పిక్నిక్ ప్రదేశాలు ఇవే..

image

శ్రీకాకుళం జిల్లాలో కార్తీక వనభోజనాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నాలుగు ఆదివారాలు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పిక్నిక్‌లు జరుపుకోనున్నారు. మన జిల్లాలో వంశధారా, నాగావళి నదీ తీరాలు, కలింగపట్నం, బౌద్ధ శిల్పాలు, బారువా బీచ్, టెలినీలపురం, మణిభద్రపురం కొండప్రాంతాలు పిక్నిక్ జరుపుకొనే ప్రాంతాలుగా ప్రసిద్ధి పొందినవి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.