News August 29, 2024
శ్రీకాకుళం: ఈ నెల 30న వన మహోత్సవం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళ నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సభాధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరవుతారని తెలిపారు.
Similar News
News September 17, 2024
SKLM: హెల్మెట్ లేకుంటే రూ.1035 ఫైన్
బైకు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని.. లేకుంటే ఫైన్ వేస్తామని శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు హెచ్చరించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే రోడ్లపైకి వస్తే రూ.1035 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.
News September 17, 2024
పలాస: దుస్తులు చించి ఆశా వర్కర్‌పై దాడి?
పలాస(M) లక్ష్మీపురం(P) కిష్టుపురంలో ఆశా వర్కర్ బూర్లె కృష్ణవేణిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లలితమ్మ జ్వరానికి, బీపీకి మాత్రలు కావాలని కోరారు. జ్వరానికి మాత్రలు ఇచ్చి.. బీపీకి డాక్టర్లే చెక్ చేసి ఇస్తారన్నారు. దీంతో లలితమ్మ భర్త కృష్ణారావు, ఆమె కుమారుడు మోహన్ కృష్ణవేణిపై దాడి చేశారు. తన నైటీని కూడా చించేశారంటూ సీఐ మోహనరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.
News September 17, 2024
శ్రీకాకుళం: అగ్ని ప్రమాదంపై అనుమానం.. డీసీసీ అధ్యక్షుడు అంబటి
పార్టీ ఆస్తులకు ఎవరైనా నష్టం కలిగిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి కృష్ణారావు అన్నారు. నగరంలోని ఇందిరా విజ్ఞానభవన్‌లో విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈనెల7 తేదీన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం విషయం ఎవరికీ చెప్పవద్దని పార్టీ నేతలుగా తాము మాట్లాడుకుంటే అదే విషయం పత్రికల్లో కథనాలు రావడాన్ని బట్టి కుట్రకోణం దాగిఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు.