News December 3, 2024
శ్రీకాకుళం: ఈ నెల 9 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం

శ్రీకాకుళంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3,906 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ముసాయిదా ఓటర్లు డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించినన్నారు. అనంతరం మార్పులు, చేర్పులకు ఈనెల 9వ తేదీన www.coeandhra.nic.in వెబ్సైట్లో కాని, సంబంధిత ఓటర్ల నమోదు అధికారికిగాని సంప్రదించి దరఖాస్తులను సమర్పించవచ్చు.
Similar News
News November 8, 2025
మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
News November 8, 2025
శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.


