News February 10, 2025

శ్రీకాకుళం: ఈ రోజు ఆదిత్యుని ఆదాయం ఎంతంటే..

image

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం ఆదివారం  ఆదాయ వివరాలను ఈవో భద్రాజి వెల్లడించారు. స్వామివారికి టికెట్లు రూపేనా రూ.6,78,600 లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,16,454లు ఆదాయం వచ్చిందన్నారు. ప్రసాదాల రూపంలో రూ.2,68,175లు వచ్చాయన్నారు. మొత్తం రూ. 10,63,229 సమకూరినట్లు ఆయన తెలిపారు. 

Similar News

News November 9, 2025

శ్రీకాకుళం: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఏటా కార్తీక మాసం 3వ సోమవారం సెలవు ఇస్తారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసన్న, కృష్ణారావు చెప్పారు. కానీ రేపటి నుంచి జిల్లాలో అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

News November 8, 2025

మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

image

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.

News November 8, 2025

టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

image

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.