News August 9, 2024
శ్రీకాకుళం: ఉద్యాన పంటలకు బకాయిల మంజూరు
ఉద్యాన పంటలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. వికాస్ యోజనలో జిల్లాకు రూ.14.32 కోట్లు మంజూరు అయినట్లు, సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద మరో రూ.86.87 లక్షలు విడుదల అయినట్లు తెలిపారు. కొత్తగా 515 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ రైతులకు రూ.28.38 లక్షలు విడుదల చేసినట్టు కలెక్టర్ తెలిపారు.
Similar News
News September 9, 2024
సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయండి: జిల్లా కలెక్టర్
నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08942-2405575) ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ coskimsupdtd@gmail.com పంపించాలని తెలిపారు.
News September 9, 2024
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ
శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 8, 2024
వంశధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది: సీఎంఓ
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాత్రి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారులను కోరారు. జిల్లా ఉన్నతాధికారులు వరద ప్రవాహాంపై క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు.