News June 27, 2024
శ్రీకాకుళం: ఉపాధి హామీ నిధులు ఉద్యాన పంటలకు అనుసంధానం

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి నిధులను ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 46,743 ఎకరాల్లో ఉద్యానవన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 24,753 ఎకరాల్లో జీడి, 5,315 ఎకరాల్లో మామిడి, 16,675 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయలు వంటివి పండిస్తున్నారు.
Similar News
News December 3, 2025
ఎచ్చెర్ల: లా కోర్సు మిగులు సీట్లు భర్తీ వాయిదా

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల లా కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం డిసెంబర్ 4 న చేపట్టనున్న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను వాయిదా పడింది. ఈ మేరకు రిజిస్ట్రార్ అడ్డయ్య ప్రకటన విడుదల చేశారు. లా కోర్సు స్పాట్ అడ్మిషన్స్లో భాగంగా గురువారం విద్యార్థుల సర్టీఫికేట్ల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయం తదుపరి తేదీ ప్రకటించే పరిశీలనను వాయిదా వేస్తున్నామన్నారు.
News December 3, 2025
శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.
News December 3, 2025
ఎచ్చెర్ల: మహిళ హత్య?

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


