News June 27, 2024
శ్రీకాకుళం: ఉపాధి హామీ నిధులు ఉద్యాన పంటలకు అనుసంధానం

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి నిధులను ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 46,743 ఎకరాల్లో ఉద్యానవన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 24,753 ఎకరాల్లో జీడి, 5,315 ఎకరాల్లో మామిడి, 16,675 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయలు వంటివి పండిస్తున్నారు.
Similar News
News November 9, 2025
శ్రీకాకుళం: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఏటా కార్తీక మాసం 3వ సోమవారం సెలవు ఇస్తారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసన్న, కృష్ణారావు చెప్పారు. కానీ రేపటి నుంచి జిల్లాలో అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
News November 8, 2025
మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.


