News April 25, 2024

శ్రీకాకుళం ఎంపీకి రూ.23.29 కోట్ల ఆస్తులు

image

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయన భార్య శ్రావ్య పేరిట రూ.23. 29 కోట్ల ఆస్తులున్నాయని నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీటెక్, ఎంబీఏ చదివినట్లు తెలిపారు. దంపతుల పేరిట రూ.6.78 కోట్ల చరాస్తులు, రూ.16.51 కోట్ల స్థిరాస్తులు, 2,335 గ్రాముల బంగారం, రూ.2.98 కోట్ల రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News September 30, 2024

శ్రీకాకుళం: దసరా సెలవులకు ఊర్లకు వెళ్తున్నారా జార జాగ్రత్త

image

దసరా సెలవులు నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు లాక్డ్ హౌసింగ్ మోనిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందించాలని చెప్పారు. ఎల్‌హెచ్ ఎంఎస్ ద్వారా ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే ఇంటి యజమానికి, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తుందన్నారు.

News September 30, 2024

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల UPDATES

image

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మొదటి రోజున అమ్మవారిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, రూ.20, రూ.50 దర్శనాలను కల్పించనున్నారు.

News September 30, 2024

శ్రీకాకుళం: అక్టోబర్ మూడు నుంచి టెట్ పరీక్షలు

image

జిల్లాలో అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు ఉంటాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎచ్చెర్లలో 2 పరీక్ష కేంద్రాలు, నరసన్నపేటలో ఒక పరీక్ష కేంద్రం బరంపురంలో 3 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో ఉంటుందన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలు ఉంటాయని తెలిపారు.