News April 25, 2024
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నామినేషన్
శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, కలమట వెంకటరమణ, కింజరాపు హరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూన్‌కు అందజేశారు.
Similar News
News January 13, 2025
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
టెక్కలి మండలం కె కొత్తూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి మండలం పెద్దసాన గ్రామానికి చెందిన బందాపు అప్పారావు గ్రామానికి వెళ్తున్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న ఆయనను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
News January 13, 2025
శ్రీకాకుళం: ఈ గ్రామానికి 400 ఏళ్ల చరిత్ర
సంక్రాంతి అనగా మనకు గ్రామాలు గుర్తుకు వస్తాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని S.Mపురం గ్రామానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం రాజులకు ఫౌజదారిగా వ్యవహరించిన షేర్ మహమ్మద్ ఖాన్ పేరు ఈ గ్రామానికి వచ్చింది. ఇతను క్రీ.శ 1600 సం. కాలంలో గ్రామంలో కోట, ఏనుగుల ద్వారం, పెద్ద చెరువు, తాగునీటి కోసం 7 బావులను సైతం ఏర్పాటు చేశారు. నేడు అవి శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని సంరక్షించాలని స్థానికులు అన్నారు.
News January 13, 2025
శ్రీకాకుళం జిల్లాలో భోగిని జరుపుకోని ప్రాంతాలివే..!
తెలుగు పండుగల్లో మొదటిది భోగి. ఈ భోగికి పురణాల గాథలతోపాటు సైంటిఫిక్ రీజన్ ఉంది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశించే క్రమంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడంతో భోగి మంటలు వేస్తారు. కాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని గాజులకొల్లివలస, నరసన్నపేటలోని బసివలస, జలుమూరులోని బసివాడ, లింగాలవలస మాత్రం పలు కారణాలతో భోగి మంటలు వేయరు. మీ ప్రాంతాల్లో కూడా భోగి చేయకపోతే కామెంట్ చేయండి.