News April 4, 2024

శ్రీకాకుళం ఎంపీ స్థానంలో నోటాకు పెరుగుతున్న ఓట్లు

image

శ్రీకాకుళం పార్లమెంట్ (ఎంపీ) స్థానానికి 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పడుతున్న ఓట్లు సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. 2014 శ్రీకాకుళం ఎంపీ స్థానానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు 6,133 (0.58 శాతం) ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో నోటాకు 25,545 (2.19 శాతం) ఓట్లు వచ్చాయి. 2013లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్నికల కమిషన్ ఈవీఎం యంత్రాల్లో నోటాకు స్థానం కల్పించింది.

Similar News

News February 25, 2026

ఎచ్చెర్ల: డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల..

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 6వ సెమిస్టర్‌ షెడ్యూల్‌ను డీన్ డా.అనురాధ విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్న్ షిప్, వైవా మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు.

News February 25, 2026

శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రధాన సమస్య..

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాకాలంలో ప్రధానంగా సీజనల్‌గా డయేరియా కేసులు గ్రామాల్లో కనిపిస్తుంటాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, కలుషితనీరు ఒక సమస్య. నాలుగేళ్ల క్రితం శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT ) ఎస్ఎంపురం క్యాంపస్‌లో 170 మంది విద్యార్థుల వరకు డయేరియాతో బాధపడ్డారు. నీటి పరీక్షలు అనంతరం ఓ బోరును శాశ్వతంగా మూసివేశారు.

News February 25, 2026

శ్రీకాకుళం: డయేరియాకు తాగునీరు కలుషితమే కారణమా?

image

శ్రీకాకుళం నగరంలో ప్రస్తుతం డయేరియా సమస్యగా మారింది. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను నిలిపివేశారు. తాగునీటి కలుషితమే డయేరియాకు కారణమా అన్న చర్చ సాగుతోంది. నీటి సరఫరా కులాయిల్లోకి డ్రైనేజీ నీరు చేరి ఉంటుందని భావిస్తున్నారు. నీటి నమూనాలను విశాఖ ల్యాబ్‌కు తరలించారు. ల్యాబ్ రిపోర్టు వస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నీరు కలుషితం అతిసార వ్యాధికి కారణమని అధికారుల ప్రాథమిక అంచనా.