News July 5, 2024
శ్రీకాకుళం ఎత్తిపోతల పథకాలకు మహర్దశ

శ్రీకాకుళం జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలకు మహర్దశ పట్టింది. ఆధునీకరణ, మరమ్మతులకు రూ.78.85 లక్షలు మంజూరు చేస్తూ శుక్రవారం సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎత్తిపోతల పథకాలైన మదనగోపాలసాగరం(రూ.31.20 లక్షలు), చిన్నసాన(రూ.14.60 లక్షలు), సౌడాం(రూ.13.80 లక్షలు), సుభద్రాపురం(రూ.4.40 లక్షలు), టెక్కలిపాడు(రూ.6.50 లక్షలు), తొగిరి (రూ.8.35 లక్షలు) ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
Similar News
News December 1, 2025
పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: శ్రీకాకుళం SP

పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ఆరోగ్యం పరిరక్షణ కోసం వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని SP మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని జేమ్స్ ఆసుపత్రిలో పోలీసు సిబ్బందికి డాక్టర్ల బృందం జనరల్ చెకప్తోపాటు షుగర్, బీపీ, హృదయ సంబంధిత సమస్యలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు వంటివి చేశారు. ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బంది సమాజానికి అవసరమన్నారు.
News December 1, 2025
టెక్కలి: డయేరియా ఘటనపై CM ఆరా.!

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో డయేరియా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. CM చంద్రబాబు సోమవారం సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో ప్రబలుతున్న డయేరియాపై ఆరోగ్యశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో డయేరియా ప్రబలడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. తాగునీటిని పరీక్షించాలని ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. సమీప గ్రామాలను సైతం అప్రమత్తం చేయాలన్నారు.
News December 1, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.


