News April 25, 2024
శ్రీకాకుళం: ఎన్నికల సాధారణ పరిశీలకులు రాక

సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హరియాణాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఘన స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్‌తో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన కలెక్టర్ అనంతరం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై కొద్దిసేపు వివరించారు.
Similar News
News March 7, 2026
సివిల్స్ ర్యాంకర్ రామును అభినందించిన అచ్చెన్న

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంకు సాధించడం పట్ల వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈరోజు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులులోనైనా ఉన్నత స్థాయిలో రాణించవచ్చన్నారు.
News March 7, 2026
శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
News March 7, 2026
శ్రీకాకుళం: వ్యవసాయ కూలీ కొడుకు సివిల్స్‌లో సత్తా

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ ఆల్ ఇండియా స్థాయిలో 463వ ర్యాంకు సాధించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రామును తల్లి లక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ చదివించారు. జి.సిగడాం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన ఆయన, వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 11 నెలలు ఉద్యోగం చేసి, సివిల్స్ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి సిద్ధమయ్యారు.


