News July 28, 2024

శ్రీకాకుళం: ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

image

కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. ఈనెల 8 నుంచి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు agnipathvayu.cdac.in వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.

Similar News

News November 6, 2025

ఏపీలో కొత్తగా 2 జిల్లాలు..మరి పలాస..?

image

APలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం 2 జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో పలాసను జిల్లాగా మార్చాలన్నా ప్రతిపాదనను పాలకులు పట్టించుకోలేదు. పునర్విభజనను కూటమి మళ్లీ తెరపైకి తేగా..నిన్న జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ప్రస్తావించకపోవడం ఉద్దానం వాసుల ఆశలను నీరుగార్చారు. మరో 2 రోజుల్లో రానున్న నివేదికలోనైనా తమ ప్రాంతం పేరు రావాలని ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.

News November 6, 2025

SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్‌ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్‌ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్‌మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.

News November 5, 2025

SKLM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

image

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మందిరంలో జల్ జీవన్ మిషన్‌పై ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డిఈ కలెక్టర్‌కు వివరించారు.