News July 28, 2024
శ్రీకాకుళం: ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. ఈనెల 8 నుంచి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు agnipathvayu.cdac.in వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.
Similar News
News July 8, 2025
శ్రీకాకుళం: 10న ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా

శ్రీకాకుళంలోని బలగలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇంటర్, ఐటిఐ ఫిట్టర్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా మెకానికల్ విద్యార్హత కలిగి 26 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులని తెలిపారు.
News July 8, 2025
గ్రామీణ ఉపాధిపై దృష్టి: కలెక్టర్

జిల్లాలో ఆదాయ సృష్టి, గ్రామీణ ఉపాధిపై కల్పనపై దృష్టి సారించి వివిధ శాఖల సమన్వయంతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, వ్యవసాయ విస్తరణ, లైవ్ స్టాక్ వంటి అంశాలపై చర్చించారు. అధికారులు పాల్గొన్నారు.
News July 7, 2025
శ్రీకాకుళం: ‘పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ రోజు ఒక మొక్క నాటాలి’

ఈ నెల 10వ తేదీన పాఠశాలల్లో మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహిస్తున్నందున ఆరోజు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం విద్యాసంస్థల ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణంతో పాటు వారి గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువ గట్లు, రోడ్లు పక్కన మొక్కలు నాటాలన్నారు.