News August 15, 2024
శ్రీకాకుళం: ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగాయి. ముందుగా పోలీసు గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచి పెట్టారు.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
News February 24, 2026
శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19,158 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 98.34 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.
News February 24, 2026
శ్రీకాకుళం నాయకులతో లోకేశ్ ఆత్మీయ సమావేశం

మంగళగిరిలో ఐటి విద్యాశాఖ మంత్రి శ్రీకాకుళం నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయంగా మాట్లాడారు. వారికి కానుకలు అందజేశారు. యోగక్షేమాలు అడుగుతూ సరదాగా గడిపారు.


