News May 25, 2024

శ్రీకాకుళం: ఏజెంట్ల ఎంపికపై పార్టీలు అప్రమత్తం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇరు పార్టీలకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించే దిశగా అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర ఏజెంట్లకు దీటుగా వారిని తట్టుకునే శక్తియుక్తులున్న వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. విశ్వసనీయుల పేర్లనే రిటర్నింగ్ అధికారులకు పంపించేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు.

Similar News

News December 6, 2025

సారవకోట: మద్యం డబ్బుల కోసం గొడవ.. వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలుదు గ్రామానికి చెందిన శంకర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.

News December 6, 2025

SKLM: వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదు

image

రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ సర్వజనీన ఆసుపత్రిలో శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం సుమారుగా 7 నెలలు కావస్తున్నా వేతనాలు చెల్లించడం లేదన్నారు.

News December 6, 2025

శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

image

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.