News October 29, 2024
శ్రీకాకుళం: ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల అయింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 16,185 మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు ఫైనల్ కీ కోసం https://cse.ap.gov.in/ వెబ్సైట్లో సందర్శించాలి. నవంబర్ 2వ తేదీన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయనుంది.
Similar News
News November 15, 2025
కోటబొమ్మాళి: భర్తకు అంత్యక్రియలు జరిపిన భార్య

కోటబొమ్మాళి మండలం జర్జంగి పంచాయతీలో గల గుంజులోవ గ్రామంలో విషాద ఘటన కలిచివేసింది. గ్రామానికి చెందిన తిర్లంగి లక్ష్మణరావు(40) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయనకు పదేళ్లు కూడా నిండని ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో భార్య తీర్లంగి రోహిణి భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ విషాద దృశ్యం అక్కడి వారి కంట కన్నీరు తెప్పించింది.
News November 14, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➤జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
➤ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
➤ కొత్తమ్మతల్లి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం
➤టెక్కలిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
➤SKLM: గ్రంథాలయాలు పాఠకులకు నేస్తాలు
➤మందసలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు
➤నరసన్నపేట: నో స్మోకింగ్ జోన్లుగా పాఠశాల ప్రాంగణాలు
News November 14, 2025
SKLM: ‘బాలలు చెడి వ్యసనాలకు బానిస కావద్దు’

బాలలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ఆడిటోరియంలో బాలలదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యను చక్కగా అభ్యసించి దేశానికి ఉపయోగపడే భావిపౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఉన్నత ఆశయాలతో మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. DSP వివేకానంద, ప్రిన్సిపల్ కృష్ణవేణి, అధికారులు ఉన్నారు.


