News June 20, 2024

శ్రీకాకుళం: ఐటీఐల్లో 112 మందికి ప్రవేశాలు

image

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో సీట్ల భర్తీకి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో జరుగుతున్న తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో రెండో రోజు బుధవారం 112 మంది విద్యార్థులకు వివిధ ఐటీఐల్లో సీట్లు కేటాయించారు. మొత్తం 464 మందిని కౌన్సెలింగ్‌కు పిలవగా 201 మంది హాజరయ్యారు. వీరిలో 112 మందికి సీట్లు కేటాయించారు. ఈరోజు 878 నుంచి 1,399 ర్యాంకు వరకు గల విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు తెలిపారు.

Similar News

News October 4, 2024

సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన శ్రీకాకుళం టీం

image

యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా గుంటూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో శుక్రవారం యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు సెమీ ఫైనల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ తదితరులు జిల్లా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

News October 4, 2024

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను పూర్తిచేయండి: మంత్రి

image

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుత్తేదారును ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండేలా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

News October 4, 2024

శ్రీకాకుళం: దసరా వేళ.. భారీగా వసూళ్లు

image

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు శ్రీకాకుళం జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెలల కిందటే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమి రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై రవాణా శాఖా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.