News June 20, 2024
శ్రీకాకుళం: ఐటీఐల్లో 112 మందికి ప్రవేశాలు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో సీట్ల భర్తీకి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో జరుగుతున్న తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో రెండో రోజు బుధవారం 112 మంది విద్యార్థులకు వివిధ ఐటీఐల్లో సీట్లు కేటాయించారు. మొత్తం 464 మందిని కౌన్సెలింగ్‌కు పిలవగా 201 మంది హాజరయ్యారు. వీరిలో 112 మందికి సీట్లు కేటాయించారు. ఈరోజు 878 నుంచి 1,399 ర్యాంకు వరకు గల విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు తెలిపారు.
Similar News
News February 11, 2026
మహాశివరాత్రి ఉత్సవాలకు కంట్రోల్ రూమ్: కలెక్టర్

సారవకోట మండలం శ్రీముఖలింగం క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘కంట్రోల్ రూమ్’ ఏర్పాటు చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అధికారులకు కేటాయించిన విధుల్లో శ్రద్ధతో పనిచేయాలన్నారు.

News February 10, 2026
శ్రీకాకుళం: పాము కాటుతో వ్యక్తి మృతి

పొందూరు(M) తుంగపేట ఎస్సీ కొలనిలో ఉంటున్నా చెందిన ఆనందరావు సోమవారం పాముకాటుతో మృతి చెందారు. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పాగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాగా అప్పట్టికే ఆయన మృతి చెందారు. ఈయన జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. స్వగ్రామం సంతకవిటి (M) సిరిపురం పంచాయతీ యాగాటిపేట.