News April 28, 2024

శ్రీకాకుళం: ఒకే గ్రామం నుంచి ముగ్గురు MLAలు

image

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు నాయకులు MLAలు అవడం విశేషం. మండలంలోని మబగాం గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు(1989-94, 1999-2004), కృష్ణదాస్(2004-2014), బగ్గు రమణమూర్తి(2014-2019) నరసన్నపేట నియోజకవర్గానికి MLAలుగా ప్రాతినిధ్యం వహించారు. కాగా ధర్మాన ప్రస్తుతం శ్రీకాకుళం MLAగా కొనసాగుతుండగా.. కృష్ణదాస్ నరసన్నపేట MLAగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News April 12, 2026

హిరమండలంలో జరిగిన దొంగతనంలో ట్విస్ట్

image

హిరమండలంలోని దేవరశెట్టి వీధిలో శనివారం భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారంలో <<19625168>>బిగ్ ట్విస్ట్<<>> నెలకొంది. చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపిన ఆభరణాలన్నీ ఇంటిలోనే ఉండటంతో అసలు చోరీయే జరగలేదని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం భారీ చోరీ జరిగిందంటూ పోలీసులకు సమాచారం రావడంతో కొత్తూరు CI ప్రసాదరావు, SI మధుసూదనరావు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News April 12, 2026

రణస్థలం: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు సాధించిన యువకులు

image

రణస్థలం మండల పరిధిలోని రావాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో SSC పరీక్షలో ఉద్యోగాలు సాధించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో లంక వెంకటేశ్ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌గా, గొర్లె అప్పలనాయుడు జూనియర్ స్టాటిస్టికల్ అధికారిగా ఎంపికయ్యారు. ఇరువురి తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు. దీంతో వీరికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.