News March 19, 2024

శ్రీకాకుళం: ఓపెన్ టెన్త్ పరీక్షలకు 11 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ టెన్త్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం 79 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 68 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 11 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Similar News

News April 21, 2025

ఎచ్చెర్ల: ఈ నెల 26న సీఎం పర్యటన .. స్థల పరిశీలన 

image

ఈ నెల 26న తేదీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్, జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు స్థల పరిశీలన చేపట్టారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కార్యక్రమానికి సీఎం హాజరుకానందున స్థల పరిశీలన చేశారు. వీరి వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News April 21, 2025

రణస్థలం: రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు

image

రణస్థలం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గొర్లె పేట గ్రామంలో గంట్యాడ రమణ అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టాడు. దీంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇలా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ గోడ కట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రామంలోని పలువురు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News April 21, 2025

శ్రీకాకుళం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ ద్వారా 458 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-184 ➤ BC-A:35 ➤ BC-B:41 ➤ BC-C:6 ➤ BC-D:32 ➤ BC-E:20 ➤ SC- గ్రేడ్1:8 ➤ SC-గ్రేడ్2:27➤ SC-గ్రేడ్3:36 ➤ ST:25 ➤ EWS:44.

error: Content is protected !!