News October 25, 2024

శ్రీకాకుళం: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు నేడే లాస్ట్

image

జిల్లాలో ఉండే ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 25 సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాలి. రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 26 నుంచి 29 వరకు, రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Similar News

News October 17, 2025

విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

image

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

News October 17, 2025

మెడిసిన్ ధరలు తగ్గుదలపై అందరికీ అవగాహన అవసరం: డీఎంహెచ్‌ఓ

image

ప్రజలు నిత్యం వినియోగించే మెడిసిన్ ధరలపై అవగాహన అవసరమని జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. అనిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీఎస్‌టీ సవరణల వలన మందులపై ధరలు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గాయని ఆమె తెలిపారు. క్లినిక్‌లు, మెడికల్ షాపుల వద్ద తగ్గిన ధరల పట్టికలను బోర్డుల రూపంలో ప్రదర్శించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 16, 2025

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన నాగబాబు

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్సీ నాగబాబు సందర్శించారు. కాంప్లెక్స్ ఆవరణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంపై ఆరా తీస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్, నాయకులు ఉన్నారు.