News October 25, 2024
శ్రీకాకుళం: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు నేడే లాస్ట్
జిల్లాలో ఉండే ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గడువు శుక్రవారంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 25 సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాలి. రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 26 నుంచి 29 వరకు, రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Similar News
News November 2, 2024
వీరఘట్టం: ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య
ప్రేమ విఫలమైందని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలం తూడి గ్రామానికి చెందిన కొనిసి శివకుమార్ (27) పార్వతీపురం కేంద్రంలోని శనివారం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్‌కు ప్రేమ వ్యవహరమే కారణమని గ్రామస్థులు అంటున్నారు.
News November 2, 2024
ఎచ్చెర్ల: డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ల ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ జి.పద్మారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్, నవంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు 3వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. జిల్లాలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను నియమించారు.
News November 2, 2024
శ్రీకాకుళం జిల్లా మీదుగా స్పెషల్ ట్రైన్
శ్రీకాకుళం జిల్లా మీదుగా విశాఖ-దానాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రైస్ (08520) రైలును నవంబర్ 4న నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్లలో ఆగనుంది. శ్రీకాకుళం రోడ్డుకు ఉదయం 11 గంటలకు, పలాస స్టేషన్‌కు మ.12:30 గంటలకు రానుంది. దానాపూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ ప్రైస్ (08519) రైలు నవంబర్ 5న బయలుదేరి ఇది పలాస స్టేషన్‌కి ఉ.11:52కి, శ్రీకాకుళం రోడ్డుకు మ.12:57కి రానుంది.