News May 11, 2024

శ్రీకాకుళం: ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై విచారణ

image

రేగిడి మండలం దేవుదల కస్తూర్బా గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం స్వర్ణ కుమారి ఎంపీడీవో శ్యామల కుమారి, ఎంఈఓ ఎం వరప్రసాదరావు, ఎరకయ్య విచారణ చేపట్టారు. ఈనెల2 పాలకొండ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన తరుణంలో గుమ్మడికాయతో దిష్టి తీయడం పై లీగల్ సెల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నివేదికలు జిల్లా కలెక్టర్ అందజేస్తామని తెలిపారు. ఎస్ ఓ లక్ష్మీ ఉన్నారు.

Similar News

News November 16, 2025

కన్నా లేవారా.. కన్నీటి రోదన మిగిల్చిన నీటి కుంట

image

కళ్లెదుట ఉన్న పిల్లలు నీటి కుంటలో పడి కానారాని లోకాలకెళ్లారని కన్నవారు జీర్ణించుకోలేకపోయారు. కన్నా..లేవరా అంటూ..చిన్నారుల మృతదేహాలపై పడి కన్నవారి కన్నీటి రోదనకు..ఊరంతా వేదనలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి(M) పంటిగుంటకు చెందిన అవినాష్(9), సుధీర్(8)లు ఆదివారం సాయంత్రం నీటి కుంటలో స్నానానికి దిగి ..ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. దీనిపై SI సింహాచలం కేసు నమోదు చేశారు.

News November 16, 2025

మరోసారి ఐపీఎల్‌కు సిక్కోలు యువకుడు

image

ఐపీఎల్‌-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్‌ను రూ.30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్‌లో విజయ్ ఆడనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ శిక్షణ పొందుతూ పలు కీలక క్రికెట్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.

News November 16, 2025

SKLM: బంగారమంటూ పిలిచి.. బురిడీ కొట్టించాడు

image

ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుందామని ఆ యువతిని కుర్రాడు నమ్మించాడు. బంగారమంటూ పిలిస్తే..మురిసిపోయిందేమో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. శ్రీకాకుళానికి చెందిన వీరిద్దరూ HYDకు ఈనెల14న బయలుదేరారు. VJAలో బస్సు మారే క్రమంలో నగల బ్యాగ్‌, ఫోన్‌తో పారిపోయాడు. చావే దిక్కని ఏడుస్తున్న ఆమెను కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తే విషయం తెలిసింది. దర్యాప్తు చేసి నగలతోపాటు యువతిని పేరెంట్స్‌కు నిన్న అప్పగించారు.