News July 26, 2024

శ్రీకాకుళం కలెక్టర్‌ను కలిసిన నూతన జేసీ

image

సిక్కోలు జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం బదిలీపై జిల్లాకు చేరుకున్నారు. అన్నమయ్య జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వచ్చారు. ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలెక్టర్ బంగ్లాలో గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆయన శుక్రవారం ఉదయం 10.00 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Similar News

News December 1, 2024

శ్రీకాకుళం: ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

image

ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేడ్కర్ కళా వేదికలో ఆదివారం ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం ప్రజల్లో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ఉందన్నారు. భవిష్యత్తులో ఎయిడ్స్ రైతు సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. వ్యాధి నియంత్రణకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుంది.

News December 1, 2024

IPLకు విజయ్.. టెక్కలిలో అభినందనలు ఫ్లెక్సీ

image

టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్- ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంపిక కావడం పట్ల టెక్కలిలో విజయ్ స్నేహితులు, క్రికెట్ అభిమానులు, గ్రౌండ్ ప్లేయర్స్ విజయ్‌కు అభినందనలు తెలుపుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం రోడ్డులో ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొట్టమొదటి యువకుడు త్రిపురాన విజయ్‌కు “All The Best” చెప్తూ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు.

News December 1, 2024

SKLM: ఆ తల్లి కష్టం ఎవరికీ రాకూడదు..!

image

భోగాపురం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కారు డ్రైవర్ జయేశ్ కన్నీటి గాథ ఇది. శ్రీకాకుళానికి చెందిన జయేశ్ తండ్రి సైతం ప్రమాదంలోనే చనిపోయారు. తల్లి సున్నపు వీధిలో టీస్టాల్ నిర్వహిస్తూ జయేశ్‌ను కష్టపడి పెంచింది. ఈక్రమంలో అతను కౌశిక్ వద్ద డ్రైవర్‌గా చేరాడు. విశాఖ విమానాశ్రయానికి బయల్దేరగా మార్గమధ్యలో చనిపోయారు. అప్పుడు భర్త, ఇప్పుడు కొడుకు ప్రమాదంలోనే కన్నుమూయడంతో ఆ తల్లి బోరున విలపిస్తోంది.