News July 3, 2024
శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేపథ్యం

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రారంభంలో నూజివీడు ఆర్టీవోగా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేశారు. మంచి పని తీరుతో ప్రజల ప్రశంసలు పొందారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పనుల విషయంలో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా 2022 ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News November 24, 2025
ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.