News September 22, 2024

శ్రీకాకుళం: కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న చాపర పూర్ణారావు

image

ఇండోనేషియా దేశంలో జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు చాపర పూర్ణారావు విజయం సాధించాడు. ఇటీవలె విదేశాలలో జరుగుతున్న పోటీలకు వెళ్లేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆయనకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ చొరవతోనే పోటీలలో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలుపొందినట్లు తెలియజేశారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News December 19, 2025

ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://brau.edu.inలో పొందుపరిచినట్లు తెలిపారు. మొత్తం 178 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.

News December 19, 2025

నరసన్నపేట: విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న DEO

image

నరసన్నపేటపేట మండలం సత్యవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం DEO రవిబాబు సందర్శించారు. అనంతరం ఉపాద్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులతో కలిసి విన్నారు. విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, పాఠశాలలోని పలు రికార్డులు పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.