News February 3, 2025
శ్రీకాకుళం: కారులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి వెళ్తున్న భక్తుల కారులో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం విశాఖ మద్దిలపాలానికి చెందిన ఐదుగురు భక్తులు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ, శ్రీకూర్మనాథుడిని సోమవారం దర్శించుకున్నారు. శ్రీముఖలింగం వెళ్తుండగా దొంపాక వద్ద కారులో మంటలు వ్యాపించాయి. దీంతో వారు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు నియంత్రించారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News July 6, 2025
ఆమదాలవలస: పార్ట్ టైం పేరుతో వెట్టి చాకిరి తగదు

పార్ట్ టైం పేరుతో వీఆర్ఏలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని రాష్ట్ర వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు షేక్ బందిగీకి సాహెబ్ అన్నార. వీఆర్ఏ సంఘం 7వ జిల్లా మహాసభ ఆదివారం ఆమదాలవలసలో జరిగింది. వీఆర్ఏలు ఫుల్ టైం విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు.
News July 6, 2025
శ్రీకాకుళం: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలి

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల, స్కూల్ స్వీపర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. మెనూ ఛార్జీలు ఒక్కొక్క విద్యార్థికి కనీసం రూ.20/-లు ఇవ్వాలని కోరారు. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు.