News October 8, 2024
శ్రీకాకుళం: కేజీబీవీల్లో ఖాళీలు.. 15 వరకు అప్లై చేసుకోండి

శ్రీకాకుళం జిల్లాలోని KGBVలో ఔట్ సోర్సింగ్లో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO తిరుమల చైతన్య తెలిపారు. కుకింగ్- 9, డేనైట్ వాచ్మెన్- 4, స్కావెంజర్- 3, స్వీపర్- 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో చౌకీదారు- 6, హెడ్కుక్- 4, సహాయ కుక్- 6 పోస్టులకు ఆసక్తి గల మహిళలు ఈ నెల 15లోగా MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
Similar News
News December 10, 2025
సిక్కోలు నేతల మౌనమేలనో..?

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
News December 10, 2025
ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.
News December 10, 2025
శ్రీకాకుళం మహిళ దారుణ హత్య

పెందుర్తిలోని సుజాతనగర్లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల శ్రీనివాస్ రైస్ పుల్లింగ్ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.


