News March 8, 2025
శ్రీకాకుళం: కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలి

అపరిష్కృతంగా ఉన్న అదృశ్య (మిస్సింగ్) కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తులో పురోగతి సాధించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి జామ్ మీటింగ్ నిర్వహించారు. వర్చువల్ గా డీఎస్పీ, సీఐ, ఎస్సైలు హాజరయ్యారు. మిస్సింగ్, రోడ్డు ప్రమాదాల కేసులు దర్యాప్తు, విచారణ, హిట్ అండ్ రన్ కేసుల దర్యాప్తు గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 23, 2025
SKLM: ఐఏఎస్‌గా ఎంపికైన యువకుడికి కేంద్రమంత్రి అభినందన

ఈ ఏడాది UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా యువకుడు బన్న వెంకటేశ్ ఆల్ ఇండియా 15వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయనను ఫోన్‌లో అభినందించారు. వెంకటేశ్ తండ్రితో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకి గర్వకారణంగా ఉందని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలన్నారు.
News April 23, 2025
శ్రీకాకుళం : డైట్ కళాశాలలో పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూలు

శ్రీకాకుళం జిల్లాలోని వమరవల్లిలోని డైట్ కళాశాలలో ఎస్ఎస్ టీసీ ప్రాతిపదికన డిప్యుటేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. డైట్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5 సీనియర్ లెక్చలర్లు, 17 లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఆయా అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలన, ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.
News April 23, 2025
SKLM: క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన DIG

విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల జిల్లాల ఎస్పీలతో DIG గోపినాథ్ జెట్టి క్రైమ్ రివ్యూ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై నియంత్రణ కోసం చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు.