News January 14, 2025
శ్రీకాకుళం: కొట్లాట ఘటనలో నలుగురిపై కేసు నమోదు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో సోమవారం జరిగిన కొట్లాట ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జీ.చిట్టిబాబు, ఎస్.విశ్వనాథం మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో వారు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు.
Similar News
News March 2, 2026
SKLM: ఇంటర్ పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 71 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జనరల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,164 మంది రాశారు. ఒకేషనల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 1,510 మందికి గాను 1,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు.
News March 2, 2026
శ్రీకాకుళం: ASW ఇంటిపై ఏసీబీ సోదాలు

శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ ASW జి.బాల ముకుందం ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని బృందం శ్రీకాకుళం పట్టణంలోని డీసీసీబీ కాలనీలోని ఇంట్లో ఈ తనిఖీలు నిర్వహించారు. ఆస్తి పత్రాలు, బంగారం నిల్వలు వంటివి తనిఖీలు చేసినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా సోదాలు చేసినట్లు సమాచారం.
News March 2, 2026
SKLM: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి..ఇతను మీకు తెలుసా?

టెక్కలిలోని మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ఆవరణలో సోమవారం విద్యుత్ షాక్‌తో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. పాఠశాల సమీపంలోని రహదారిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో పక్కనే ఉన్న కాలువపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని టెక్కలి ఎస్ఐ కె.రాము పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ప్రమాదవ శాత్తు జరిగిందా? తెలియాల్సి ఉంది.


